కొవిడ్‌పై పోరాటంలో ముందు వరుసలో నిలిచి మరణించిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం తమ దగ్గరలేదంటూ కేంద్రం చెప్పడం దారుణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరికాదని.. అది కొవిడ్ యోధులను అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు.
'అలా చెప్పి కరోనా యోధులను అవమానిస్తారా?' - కరోనా యోధుల మరణాలు సమాచారం
కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచి ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల సమాచారం లేదన్న కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ విధంగా కరోనా యోధులను అవమానించడం ఎందుకని ప్రశ్నించారు.
కరోనా కారణంగా మరణించిన.. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల వివరాలు తెలపాలంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినిచౌబే. ఆ వివరాలు కేంద్రం దగ్గర ఉండవని, ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని సమాధానం ఇచ్చారు. ఆ వార్తను ట్యాగ్ చేస్తూ.. 'సమాచారం లేని మోదీ సర్కారు' అనే ట్యాగ్‌తో అమెరికా నుంచి రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. దీపాలు వెలిగించడం, కంచాలను కొట్టి శబ్ధం చేయడం కంటే... కరోనా యోధుల రక్షణే చాలా ముఖ్యమని అన్నారు.
ఇదీ చూడండి:-'మోదీ హామీలు.. గాలిలో మేడలు కట్టడం ఒకటే'