తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నియంతల పేర్లన్నీ 'ఎం'తోనే ఎందుకు?' - రాహుల్ గాంధీ నియంత న్యూస్

చాలా మంది నియంతల పేర్లు 'ఎం' అక్షరంతోనే ఎందుకు ప్రారంభమవుతాయంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు నియంతల పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

'Why do so many dictators have names that begin with M?' asks Rahul Gandhi
నియంతల పేర్లన్నీ 'ఎం'తోనే ఎందుకు?

By

Published : Feb 3, 2021, 12:59 PM IST

నియంతలకు 'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఎందుకున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పలువురి నియంతల పేర్లను తన ట్వీట్​లో ప్రస్తావించారు. దీనికి ఆయన వివరణ ఇవ్వనప్పటికీ.. ప్రధాని మోదీ లక్ష్యంగానే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు స్పష్టమవుతోంది.

"చాలా మంది నియంతలకు 'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఎందుకు ఉన్నాయి? మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఇటీవల మోదీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్నారు రాహుల్. రైతు నిరసనలు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలపై తరచుగా స్పందిస్తున్నారు. ఓ వైపు చైనా సరిహద్దులో నిర్మాణాలను ముమ్మరం చేస్తుంటే.. ఆ దేశం పేరును ప్రస్తావించడానికే మోదీ భయపడుతున్నారని మంగళవారం ఎద్దేవా చేశారు. ఈ విపత్తను నివారించడానికి దృఢమైన చర్యలు అవసరమని, దురదృష్టవశాత్తు మోదీకి అంత ధైర్యం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై రాజ్యసభలో 15 గంటల పాటు చర్చ

ABOUT THE AUTHOR

...view details