సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. సరిహద్దులో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి చైనాపై భారత ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు. జాతీయ అంశాలు చాలా ముఖ్యమని.. వాటిని రక్షించడం ప్రభుత్వం బాధ్యత అని ట్వీట్ చేశారు.
"జాతికి సంబంధించిన విషయాలు చాలా ముఖ్యం. వాటిని రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది. అలాంటప్పుడు.. చైనాతో యథాతథస్థితిని పునరుద్ధరించడానికి భారత్ ఎందుకు కృషి చేయలేదు? గల్వాన్ ఘటనలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనా.. తన వైఖరిని సమర్థించుకునే అవకాశం భారత్ ఎందుకు ఇచ్చింది? గల్వాన్ లోయ సార్వభౌమాధికారాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు ఎందుకు?"
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.