భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్‌పై మరోమారు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విరాళాలకు సంబంధించి విమర్శలకు మరింత పదును పెంచారు. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం వీడి పారిపోయిన మెహుల్ చోక్సీ నుంచి రాజీవ్ గాంధీ ట్రస్టుకు భారీగా విరాళాలు అందాయని ఆరోపించారు. అందుకు సాయంగా ఆ తర్వాత బ్యాంకుల నుంచి రుణాలను చోక్సీ పొందారని తెలిపారు.
" చైనా రాయబారుల నుంచి రాజీవ్ గాంధీ ట్రస్టుకు 2005 నుంచి 2009వరకు విరాళాలు అందాయి. వాణిజ్య ప్రయోజనాల కోసం పలు సంస్థలు, ఎన్జీవోలు భారీగా విరాళాలు సమకూర్చాయి. కాగ్ ఆడిటింగ్‌ను ట్రస్టు ఎందుకు తిరస్కరించింది? సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజీవ్ గాంధీ పౌండేషన్ ఎందుకు రాదు? మెహుల్ చోక్సీ నుంచి విరాళాలు ఎందుకు తీసుకున్నారు? అతనికి బ్యాంకు రుణాలు ఎందుకు ఇచ్చారు? ట్రస్టుకు చోక్సీకి సంబంధమేంటి? దేశ ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు."
- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు.