తూర్పు లద్దాఖ్‌లో చైనా చొరబాట్ల వ్యవహారంలో కేంద్రంపై మరోమారు విమర్శలు చేసింది కాంగ్రెస్. చైనా అతిక్రమణలు నిజమేనన్న నివేదికలను రక్షణ శాఖ తమ వెబ్సైట్ నుంచి తొలగించటాన్ని తప్పుబట్టింది. వెబ్సైట్ నుంచి పత్రాలను తీసేసినంత మాత్రాన వాస్తవాలు మారవని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
మే నెలలో తూర్పు లద్దాఖ్‌లోని వివిధ ప్రాంతాల్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడినట్లు రక్షణ శాఖ అధికారికంగా అంగీకరించింది. జూన్ నెలలో తమ కార్యకలాపాలకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే.. మీడియాలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో గురువారం ఆ పత్రాలను తొలగించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది.
" చైనాను ఎదుర్కోవడం కాదు కదా.. కనీసం వారి పేరు చెప్పేందుకు కూడా భారత ప్రధానికి ధైర్యం లేదు. మన భూభాగంలోకి చైనా చొరబడలేదని పదేపదే చెబుతూ.. వెబ్సైట్ నుంచి పత్రాలను తొలగించినంత మాత్రాన వాస్తవాలు మారవు."