జమ్ముకశ్మీర్‌లో అదనపు బలగాల మోహరింపు పలు ఊహాగానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఉగ్రకార్యకలాపాలు కొంతమేర తగ్గినప్పటికీ... భారీ మొత్తంలో భద్రతా దళాల మోహరించడంపై స్థానిక నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఆర్టికల్ 35ఏ రద్దు?
కశ్మీర్లో అదనపు బలగాల వార్తలు వినగానే అందరి దృష్టి మొదట 35ఏ, 370 అధికరణాల రద్దు అంశంపై పడింది. ప్రత్యేక హోదాను రద్దు చేసేందుకుకేంద్రంసమాయత్తమవుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్నాయి ఈ అధికరణాలు. 2014, 2019 ఎన్నికల్లో ఈ అధికరణాలు రద్దు అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో ఉంచింది భాజపా. ఈ పరిణామాల నేపథ్యంలో ఊహాగానాలకు మరింత ఊతమందింది.ఈ ఊహాగానాలను భాజపా ఖండించింది