తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తక్కువ ఖర్చుతో చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రులను గుర్తించాలి' - ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా వైద్యానికి సుప్రీం డిమాండ్

కరోనా వైరస్‌ సోకినవారికి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది.

covid treatment free In private hospitals
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత కరోనా వైద్యం

By

Published : May 27, 2020, 9:43 PM IST

ఉచితంగా లేదా తక్కువ ధరకు భూమి పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని సుప్రీకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ఆస్పత్రులను గుర్తించాలని జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్సకు అయ్యే ఖర్చును నియంత్రించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. తక్కువ ఖర్చుతో చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రులను గుర్తించాలని కేంద్రానికి సూచించింది.

ఇది విధానపరమైన అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం సుప్రీంకోర్టు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది .

ఇదీ చూడండి:భానుడి ప్రతాపం నుంచి 24 గంటల్లో ఉపశమనం!

ABOUT THE AUTHOR

...view details