సరిహద్దుల్లో చొరబాట్లకు సంబంధించి అధికారంలో ఉన్న నేతలు చైనా పేరు పలికేందుకు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"ప్రతి కాంగ్రెస్ కార్యకర్తతోపాటు 130 కోట్లమంది భారతీయులు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నారు. వారిపై పూర్తి భరోసా ఉంచారు. చైనాకు దీటైన జవాబు ఇచ్చిన సైన్యానికి సెల్యూట్. కానీ, అధికారంలో ఉన్నవారు చైనా పేరు ప్రస్తావించడానికి ఎందుకు భయపడుతున్నారు? చైనాను వెనక్కు పంపేందుకు ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో ప్రతి భారతీయుడు ఈరోజు ప్రశ్నించాలి."
- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
"ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తుందా? దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందా?" అని ప్రశ్నించారు సుర్జేవాలా. 'ఆత్మనిర్భర్ భారత్'ను నెహ్రూ, సర్దార్ పటేల్ ఎప్పుడో ప్రారంభించారని తెలిపారు. కానీ మన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు.
మోదీ ప్రసంగంపై పటేల్ విమర్శలు..