ప్రపంచానికి యోగా నేర్పించేందుకు భారతీయుడ్ని నామినేట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ(డీఎస్వీవీ) ఉప కులపతి చిన్మయ్ పాండ్యాను యోగా నిపుణుడిగా నామినేట్ చేసింది.
ప్రపంచానికి యోగా నేర్పించనున్న భారతీయుడు! - dvss latest news
యోగ నిపుణులుగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ ఉప కులపతిని నామినేట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఓ యాప్ ద్వారా యోగాను ప్రజలకు నేర్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
డబ్ల్యూహెచ్‌వో యోగా శిక్షకునిగా ఉత్తరాఖండ్ యూనివర్సిటీ వీసీ
డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ఓ యాప్ ద్వారా ప్రజలకు యోగా నేర్పించనున్నారు పాండ్య. ఈ విషయాన్ని డీఎస్వీవీ అధికార ప్రకటనలో తెలిపింది. టెంపుల్టన్ అవార్డుల్లో పాండ్య జ్యూరీ మెంబర్‌గా ఉన్నారని.. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్, లాత్వియా, చికాగో విశ్వవిద్యాలయాల్లో ప్రసంగాలు ఇచ్చినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: భారత 'బోల్ట్'కు శాయ్‌లో శిక్షణ.. ఒలింపిక్స్ కోసమేనా!
Last Updated : Mar 1, 2020, 11:58 AM IST