తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రుణాలు ఇచ్చేది ఎవరు.. తీసుకునేది ఎవరు?' - చిదంబరం

కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, నిర్మలా సీతారామన్​ విభిన్న ప్రకటనలపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఎద్దేవా చేశారు. ఎంఎస్​ఎంఈ రంగంలో రుణాలపై ఇద్దరు మంత్రులు వేర్వేరుగా వివరాలు చెప్పారని.. ముందు మీ లెక్కలు సరిచూసుకోవాలని విమర్శించారు.

Chidambaram
పి.చిదంబరం

By

Published : May 15, 2020, 1:27 PM IST

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్​పై కాంగ్రెస్ సీనియర్​ నేత పి.చిదంబరం విమర్శలు గుప్పించారు. ఎంఎస్​ఎంఈ రుణాలకు సంబంధించి కేంద్ర మంత్రులు విభిన్న ప్రకటనలు చేశారని ఎద్దేవా చేశారు.

"ఎంఎస్​ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకులు రూ.5 లక్షల కోట్లు బకాయి పడ్డాయని నితిన్ గడ్కరీ చెప్పారు. అదే రంగానికి రూ.3 లక్షల కోట్ల రుణాలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

అయితే ఇక్కడ ఎవరు రుణ దాత? ఎవరు గ్రహీత? ముందుగా కేంద్ర మంత్రులు వాళ్ల లెక్కలు సరిచూసుకోవాలి. తర్వాత ఎంఎస్​ఎంఈలు ప్రభుత్వ సాయం లేకుండా తమను తాము రక్షించుకునేలా చేయండి."

- పి. చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ మొదటి రోజు ప్రకటనలో భాగంగా ఎంఎస్​ఎంఈలకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు నిర్మలా సీతారామన్​. ఎంఎస్​ఎంఈలకు పూచీకత్తు లేని రూ.3 లక్షల కోట్ల రుణాలు అందిస్తామని ప్రకటించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్​ఎంఈలకు రూ. 20 వేల కోట్ల సబార్డినేట్ లోన్లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ద్వారా రూ.50 వేల కోట్లు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details