తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెల్ల పులులకు పుట్టినిల్లు - సఫారి

మధ్యప్రదేశ్​లోని ముకుంద్​పూర్ అటవీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది తెల్ల పులులకు పునర్జన్మ ప్రసాదించిన అడవి. వాటి మనుగడకు కారణమైన ఈ అటవీ ప్రాంతాన్ని సఫారిగా మార్చింది ప్రభుత్వం.

తెల్లపులుల సఫారి

By

Published : Mar 6, 2019, 8:58 PM IST

మధ్యప్రదేశ్ సత్నా జిల్లా ముకుంద్​పూర్ రేవా అటవీ ప్రాంతం ప్రపంచంలోని ఏకైక తెల్లపులుల సఫారీ. ఈ సఫారీకి వెళ్లేందుకు పర్యటకులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. మిగతా సఫారీలతో పోలిస్తే ముకుంద్​పూర్​ను ప్రత్యేకంగా నిలిపేవి ఈ తెల్లపులులే. రహదారి పక్కనే తెల్ల పులులను దగ్గరగా చూడటం పర్యటకులకు సరదాగా అనిపిస్తుంది.

తెల్లపులుల సఫారి

1951లో తెల్ల పులుల సంరక్షణకు రేవా మహారాజు మార్తాండ్ సింగ్ శ్రీకారం చుట్టారు. వేటలో భాగంగా దొరికిన ఓ తెల్ల పులి పిల్ల కోసం గోవింద్​గఢ్​లో 'బాగ్​మహల్'​ను ప్రారంభించారు. ఆ పులికి 'మోహన్'​ అని పేరు పెట్టారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న తెల్ల పులులన్నీ మోహన్​ వారసులే. మార్తాండ్ సింగ్​ కృషితోనే తెల్లపులుల మనుగడ సాధ్యమైంది.

తెల్లపులుల సఫారి

అదే స్ఫూర్తితో ముకుంద్​పూర్​లో తెల్లపులుల సంరక్షణ కేంద్రాన్ని 'మోహన్'​ పేరుతో ఏర్పాటు చేశారు. వైట్​ టైగర్​ సఫారీలో వింధ్య, రఘు అనే రెండు తెల్లపులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్​లో ఉన్న తెల్ల పులులన్నింటికి తల్లి వింధ్య.

రఘు, వింధ్య

ABOUT THE AUTHOR

...view details