సొంత సైన్యాన్ని బెదిరించేందుకు కాల్పులు..
సరిహద్దు వెంబడి చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులపై దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కాల్పులకు పాల్పడుతోందని పేర్కొంది.
వాస్తవాధీన రేఖ వెంబడి సెప్టెంబర్ 7న చైనా ముందుకు వచ్చే ప్రయత్నం చేసిందని భారత సైన్యం వెల్లడించింది. అయితే, మరింత ముందుకు వెళ్లేందుకు సొంత దళాలే నిరాకరించగా.. వారిని బెదిరించేందుకు గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారని స్పష్టం చేసింది. ఓ వైపు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ప్రపంచానికి అసత్యాలు వల్లివేస్తుందని భారత ఆర్మీ తెలిపింది.
సరిహద్దుల్లో శాంతి, సామరస్యానికి కట్టుబడి ఉన్నట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేసింది.