గాంధీనగర్... గుజరాత్ రాజధాని. ఆ రాష్ట్రంలో ఉన్న 8 మెట్రో నగరాల్లో చాలా చిన్నది. కేవలం 3 లక్షల జనాభా ఉన్న ఈ చిన్న మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే గాంధీనగర్ ఆ రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. గాంధీనగర్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 259 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17 మంది మృత్యువాతపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 143 కాగా.. ముగ్గురు వైరస్‌కు బలయ్యారు.
అహ్మదాబాద్ నగరానికి భౌగోళికంగా దగ్గరగా ఉండటం వల్ల గాంధీనగర్‌లో కరోనా భయాలు మొదటి నుంచే అధికంగా ఉన్నాయి. దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం, అనంతరం నగరంలో 14 కేసులు బయటపడటం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికీ గాంధీనగర్‌లో భారీ సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి.
మార్చి 18న తొలి కేసు
దుబాయి నుంచి వచ్చిన ఉమాంగ్ పటేల్‌కు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. గాంధీనగర్ జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదే. అనంతరం అతని కుటుంబ సభ్యులు, బంధువులకు పరీక్షలు చేయగా.. మొత్తం 11 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో గాంధీనగర్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
సరిహద్దులు బంద్!
ఆస్పత్రిలో చేరిన 32 రోజుల తర్వాత గాంధీనగర్‌కు చెందిన తొలి కరోనా బాధితుడు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. ఓ దశలో కరోనా బాధితులు లేని ప్రాంతంగా గాంధీనగర్ అవతరించింది. అయితే అహ్మదాబాద్ నుంచి నిరంతరం ప్రజల రాకపోకలు సాగించడం రాజధాని నగరానికి శాపంగా మారింది. కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ప్రతిపక్ష నేత శైలేంద్ర సింగ్ బిహోలా పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో ఒక్క సీహెచ్ రోడ్ మినహా గాంధీనగర్ సరిహద్దులన్నీ మూసేశారు అధికారులు.
తొలి మరణం
గాంధీనగర్‌లో తొలి కరోనా బాధితుడు ఉమాంగ్ పటేల్ తాత (82ఏళ్లు) వైరస్‌కు బలయ్యాడు. సెక్టార్ 29లో నివసించే ఆయనను గాంధీనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు విడిచాడు. నగరంలో సంభవించిన తొలి వైరస్ మరణం ఇదే. మరోవైపు గాంధీనగర్ కొలవడా గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళ సైతం మహమ్మారి బారిన పడి మరణించింది.
కలెక్టర్ ఆదేశాలు