తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం

చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా తేడా లేకుండా.. ఆ ప్రాంతంలోని స్థానికులందరూ ఒక్కసారిగా రహదారిపైకి చేరారు. పోటాపోటీగా వెండి పూసలు, గోళీలు ఏరుకుంటూ బిజీగా గడిపారు. అదేంటీ రోడ్డుపై వెండి ఎక్కడిది అనుకుంటున్నారా..? అవును అక్కడ వెండి వర్షం కురిసింది మరి. బిహార్​ సీతామఢీలోని సుర్సంద్​లో జరిగిందీ ఘటన.

By

Published : Nov 7, 2019, 10:54 AM IST

Updated : Nov 7, 2019, 7:39 PM IST

రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం

రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం

ఒక్కసారి ఆలోచించండి.. వేకువజామున మీరు మంచి నిద్ర నుంచి అప్పుడే లేస్తుండగా బంగారం, వెండి వర్షం కురిస్తే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. ఇండో-నేపాల్​ సరిహద్దు ప్రాంతం బిహార్​లోని సుర్సంద్​ వద్ద అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.

ఉదయం కళ్లు తెరిచి చూసే సరికి రోడ్డుపై మొత్తం వెండి పరుచుకొని ఉంది. ఆశ్చర్యపోయిన స్థానికులు వెండి పూసలు, గోళీలను ఏరుకోవడం మొదలుపెట్టారు. అందినకాడికి దండుకొని పోయారు.

బాబా భీం రావ్​ అంబేద్కర్​ టవర్​ చౌక్​ నుంచి సుర్సంద్​లోని జవహర్​లాల్​ నెహ్రూ కళాశాల​ వరకు వెండి చెల్లాచెదురుగా పడి ఉంది. ప్రతి ఒక్కరూ వెండి ఎక్కడినుంచి వచ్చిందా అని ఆలోచనలో పడిపోయారు. కాస్త తేరుకున్న అనంతరం... ఇది మిడ్​నైట్​ స్మగ్లర్ల పనేనని భావించారు.

మిడ్​నైట్​ స్మగ్లర్ల పనే...

అర్ధరాత్రి పూట నేపాల్​ నుంచి సుర్సంద్​ మీదుగా భారత భూభాగంలోకి అక్రమంగా బంగారం, వెండి తరలిస్తుంటారు స్మగ్లర్లు. నేపాల్​ కరెన్సీతో వెండిని అక్కడి నుంచి సేకరించి.. భారత్​లోని టోకు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఈ సారీ అలాగే తీసుకొస్తుండగా అదుపుతప్పి వెండి రోడ్డుపై పడిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఆలస్యంగా సమాచారం అందిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కరెన్సీ మార్పు తదితర లావాదేవీలు ఎక్కువగా సుర్సంద్​ పంచాయతీ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంటాయని వెల్లడించారు. ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు.

ఇదీ చూడండి:'దివాలా చట్టం' బలోపేతం చేస్తే బహులాభం

Last Updated : Nov 7, 2019, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details