తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సైనికుల మృతికి చైనాపై ప్రతీకారం ఎప్పుడు?' - గాల్వన్ ఘర్షణపై సంజయ్​ రౌత్

గాల్వన్​లో సైనికుల మృతి పట్ల దేశం ప్రతీకారం కోరుకుంటోందని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తెలిపారు. చైనాకు తగిన గుణపాఠం ఎప్పుడు చెబుతారని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో వెల్లడించాలని కోరారు.

befitting reply to China
చైనాపై ప్రతీకారం

By

Published : Jun 17, 2020, 12:37 PM IST

గాల్వన్​ లోయలో భారత సైనికుల మృతికి ప్రతిగా చైనాకు ఎప్పుడు తగిన సమాధానం చెబుతారని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్. లద్ధాఖ్​లో జరుగుతున్న పరిణామాల వెనుక వాస్తవాలను వెల్లడించాలని కోరారు.

"ప్రధాని మోదీ.. మీకు ధైర్యం ఉంది. మీరొక యోధుడు. మీ నాయకత్వంలో సైనికుల మరణానికి దేశ ప్రజలు ప్రతీకారం కోరుకుంటున్నారు. చైనా దుశ్చర్యలకు తగిన సమాధానం ఎప్పుడు చెబుతారు?

బుల్లెట్ పేలకుండానే మన 20 మంది జవాన్లు అమరులయ్యారు. మనం ఏం చేశాం? చైనా జవాన్లు ఎంత మంది చనిపోయారు? మన భూభాగంలోకి చైనా ప్రవేశించిందా? ఈ సంక్షోభంలో దేశం మొత్తం మీ వెంట ఉంది. కానీ నిజం ఏంటి? సమాధానం చెప్పండి. ఏదో ఒకటి స్పష్టతనివ్వండి. దేశం నిజం తెలుసుకోవాలనుకుంటోంది. జైహింద్​!"

- సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

నవీన్ పట్నాయక్ స్పందన..

గాల్వన్​ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన జవాన్లకు సెల్యూట్​ చేశారు.

గాల్వన్​ లోయ ఘర్షణ..

భారత్​-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న గాల్వన్​ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగటం వల్ల కల్నల్ సంతోష్​ బాబు సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. మరో పది మంది గల్లంతైనట్లు సమాచారం.

చైనా వైపున కూడా గణనీయంగా మృత్యువాత పడ్డట్లు భారత వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 40 మంది సైనికులు గాయపడటం లేదా మరణించినట్లు భావిస్తున్నారు. మరణించినవారిలో చైనా కమాండింగ్ అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:గాల్వన్​ లోయ ఘర్షణల్లో చైనా కమాండర్ మృతి!

ABOUT THE AUTHOR

...view details