తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. లేక దానిని కూడా యాక్ట్ ఆఫ్ గాడ్గానే అనుకుని చైనా దురాక్రమణలను దేవుని ఖాతాలోనే వేస్తారా? అంటూ చూరకలంటిస్తూ ట్వీట్ చేశారు.
జీఎస్టీ వసూళ్లపై కరోనా ప్రభావాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఈ విమర్శలు చేశారు రాహుల్.
"చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడు చర్యలు చేపడుతుంది? లేదా దానిని కూడా యాక్ట్ ఆఫ్ గాడ్‌గా అనుకుని వదిలేస్తారా? "