ఆడపిల్లలపై అత్యాచారానికి తెగబడేవారిని ఆరు నెలలలోపు ఉరితీసేలా కఠిన చట్టాలు తీసుకురావాలని ఉద్యమిస్తున్న దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్.. 'దిశ' కేసు నిందితుల ఎన్కౌంటర్పై స్పందించారు. పశువైద్యురాలిని నవంబర్ 27న అతికిరాతకంగా హత్యాచారం చేసిన దోషులు పారిపోతుంటే.. పోలీసులు మాత్రం ఏం చేయగలరని అన్నారు.
''హత్యాచారానికి పాల్పడ్డ నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అందుకే దేశంలో బలమైన వ్యవస్థను తీసుకురావాలని మేము కేంద్రాన్ని కోరుతున్నాం. కోర్టు విచారణల తరువాత ఇలాంటి ఘోరాలకు పాల్పడే కామాంధులకు మరణ శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ చేయడం వల్ల కనీసం ఈ నలుగురినైనా.. నిర్భయ నిందితులను ప్రజల సొమ్ముతో జైల్లో పోషించినట్లు పోషించే పని లేకుండా పోయింది."
-స్వాతి మాలివార్, డీసీడబ్ల్యూ చైర్పర్సన్