తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మే 3 తర్వాత లాక్​డౌన్​ పరిస్థితి ఏంటి? - corona deaths

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​.. మే 3తో పూర్తి కానుంది. మరి గడువు ముసిగిన అనంతరం ఈ ఆంక్షలను కొనసాగించే యోచనలో ప్రభుత్వం ఉందా? అయితే కొన్ని షరతులతో ఆంక్షలను సడలించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

what is the decisions of indian government after completion of lockdown?
మే3 తర్వాత లాక్​డౌన్​ పరిస్థితి ఏంటి?

By

Published : Apr 21, 2020, 8:53 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగించాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గడువు ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలను కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ విషయంపై కేంద్రం చర్చించలేదని సమాచారం. కానీ మే3 తర్వాత షరతులు, పరిమితులతో కూడిన జీవన విధానానికి అనుమతులిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఇలానే అనుమతులు..

విమాన, రైళ్ల సేవలు మే 3 తర్వాత ప్రారంభం కావని తెలుస్తోంది. కొన్ని రోజులకు నిర్దేశించిన పట్టణాల మధ్య ప్రయాణాలకే అనుమతి ఇస్తారని సమాచారం. కొన్నాళ్లు మాస్క్‌లు, వ్యక్తిగత దూరం జీవితంలో భాగం కానున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్క్‌ ఉంటేనే అనుమతి ఇస్తారట. పెళ్లి వంటి శుభకార్యాలు, మత సమ్మేళనాలపై ఆంక్షలు కొనసాగుతాయి. నిత్యావసరాల దుకాణాలు వ్యక్తిగత దూరం పాటిస్తూ, వినియోగదారులతో పాటింపజేస్తూ అమ్మకాలు జరపొచ్చు.

జోన్లవారీగా విభజన

కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం ఇకపై దేశవ్యాప్తంగా జోన్ల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ఆంక్షల సడలింపు మొదట గ్రీన్‌ జోన్లకు ఉంటుంది. ఆ తర్వాత రెడ్‌ జోన్లలో కట్టడిని బట్టి ఆలోచిస్తారు. ముంబయి, దిల్లీ, నొయిడా, ఇండోర్‌పై మే 3 తర్వాతా దృష్టి ఎక్కువగా ఉండనుంది. ఎందుకంటే ఇక్కడ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏదేమైనప్పటికీ మే 15 తర్వాత దేశంలో కరోనా అసలైన స్థితి తెలియనుందని సమాచారం. ఏప్రిల్‌ 20 నుంచి చేపట్టాల్సిన సడలింపులను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు.

మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 18,985 పాజిటివ్‌ కేసులు ఉండగా మృతుల సంఖ్య 603గా ఉంది. 15,122 మంది చికిత్స పొందుతున్నారు. 3,259 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు.

ABOUT THE AUTHOR

...view details