వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) వైదొలగడంపై శివసేన స్పందించింది. ఎన్డీఏ ఇంకా ఉందా? ఉంటే ఏయే పార్టీలు ఉన్నాయని ప్రశ్నిస్తూ.. తన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో రాసుకొచ్చింది.
ఎన్డీఏలో ఆఖరి స్తంభంగా నిలిచిన శిరోమణి అకాలీదళ్.. కూటమి నుంచి వైదొలగక తప్పలేదని అభిప్రాయపడింది. హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూటమి నుంచి వెళ్తున్న సమయంలో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతకముందు శివసేన కూడా అదే తరహాలో ఎన్డీఏను వీడింది. ఈ రెండు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏలో ఇంకా ఏముందని ప్రశ్నించింది. ఒకవేళ ఉంటే.. వారికి హిందుత్వంతో సంబంధం ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.
నిర్దిష్ట ఆకారానికి ముఖచిత్రాలుగా..