పార్టీ డ్రగ్స్‌గా వ్యవహరించే యాబా ట్యాబ్లెట్లను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తుండగా కోల్‌కతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీటిని బంగ్లాదేశ్‌కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్టయిన వారి నుంచి 50 వేల ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ పట్టివేత - కోల్‌కతాలో రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ పట్టివేత
కోల్‌కతా పోలీసులు రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ (యాబా ట్యాబ్లెట్లు)ను స్వాధీనం చేసుకున్నారు. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వీటిని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు.
రూ.2.5 కోట్ల విలువైన పార్టీ డ్రగ్స్ పట్టివేత
బీఎస్ఎఫ్ దళాలు పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన తరువాత 2019 నుంచి యాబా ట్యాబ్లెట్ల అక్రమ రవాణా పెరిగింది. దక్షిణ బెంగాల్‌లోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా ఈ వ్యాపారం జోరందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మణిపూర్‌కు చెందిన ఇద్దరు మాదకద్రవ్యాల డీలర్లను దక్షిణ కోల్‌కతాకు చెందిన ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.3 కోట్ల విలువైన యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:స్వదేశీ తయారీ.. చౌకైన కరోనా టెస్ట్ కిట్