బంగాల్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో నగరాలు మూగబోయాయి. రోడ్లు, షాపింగ్ మాల్స్, వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
కోల్కతా, ధాకురియా క్రాసింగ్, పార్క్ సర్కస్ క్రాసింగ్, గారియాహట్ క్రాసింగుల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నో ఎంట్రీ బోర్డులు, ఖాళీగా దర్శనమిచ్చిన బస్టాండ్లతో లాక్ డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
మిడ్నాపోర్ లో దుకాణాలు మూతబడ్డాయి. రోడ్లపై జనాన్ని తిరగనీయకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.
లాక్ డౌన్ వేళ.. బయటికొచ్చావేం..? సిలిగురిలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. జనం ఇంటికే పరిమితమయ్యారు. డిజిటల్ సిగ్నళ్లలో లైట్లు వెలగనేలేదు.
గడప దాటం... కరోనాని స్వాగతించం ఉల్లంఘన...
బంగాల్ రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నప్పటికీ... నార్త్ 24 పరాగనా జిల్లా ప్రజలు మాత్రం నిబంధనలను ఉల్లంఘించారు. మార్కెట్లో కనీసం మాస్కులు లేకుండా, గుంపులుగా తిరుగుతూ కనిపించారు.
మార్కెట్ లో లాక్ డౌన్ ఏది...? ఇదీ చదవండి: అమ్మతో ఆడుకున్న ఆ బుజ్జి గొరిల్లా ఇక లేదు