బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష కురువృద్ధుడు బుద్దదేవ్ భట్టాచార్య (75) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
"బుద్దదేవ్ భట్టాచార్య రాత్రి 8.30 గంటల సమయంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు ఆయన పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాము. ప్రాథమిక చికిత్స అనంతరం భట్టాచార్యా ఆరోగ్యం స్థిరంగా ఉంది."
-ఆస్పత్రి వర్గాల ప్రకటన