తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటి ఆవరణలోనే కరోనా మృతదేహం ఖననం - Burial

బంగాల్​లోని తూర్పు మెదినీపుర్​లో అమానుషం చోటుచేసుకుంది. కరోనా సోకి మరణించిన బాధితుడి అంత్యక్రియలకు అధికారులు ఎలాంటి సహకారం అందించకపోవడం వల్ల.. ఇంటి ఆవరణలోనే చివరి సంస్కారాలు నిర్వహించారు.

West Bengal family forced to bury COVID victim outside their home
అమానుషం: ఇంటి ఆవరణలోనే కరోనా మృతదేహం ఖననం

By

Published : Jul 27, 2020, 1:21 PM IST

బంగాాల్​లోని తూర్పు మెదినీపుర్​ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తిని ఇంటి పరిసరాల్లోనే ఖననం చేశారు కుటుంబ సభ్యులు. దాదాపు 12 గంటల పాటు వేచి చూసినప్పటికీ.. అధికారులు స్పందించకపోవడం వల్ల కాంపౌండ్​లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏం జరిగిందంటే..!

కోలాఘాట్​కు చెందిన 70ఏళ్ల వృద్ధుడు గత ఆదివారం అనారోగ్యానికి గురయ్యారు. తర్వాతి రోజు కరోనా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. పరీక్షల తర్వాత వృద్ధుడిని ఇంటికి పంపించారు ఆస్పత్రి సిబ్బంది. కరోనా నిర్ధరణ అయినట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందించారు. రోగిని తీసుకెళ్లడానికి అంబులెన్సును పంపనున్నట్లు తెలిపారు. అయితే.. పరిస్థితి విషమించడం వల్ల అంబులెన్సు వచ్చేలోపే బాధితుడు మరణించాడు.

ఆశ్చర్యకరంగా.. వచ్చిన అంబులెన్సు మృతుడిని తీసుకెళ్లకుండా తిరిగివెళ్లిపోయింది. పోలీసులదే బాధ్యత అంటూ చేతులు దులిపేసుకున్నారు అంబులెన్సు సిబ్బంది. ఎవరైనా వస్తారని కుటుంబ సభ్యులు గంటల పాటు ఎదురు చూశారు. ఇద్దరు అధికారులు వచ్చి రెండు పీపీఈ కిట్లు ఇచ్చి వెళ్లారు. కానీ స్థానిక శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు అడ్డుచెప్పారు.

ఇంట్లోనే

గ్రామస్థులు ఒత్తడి పెంచడం వల్ల గత్యంతరం లేక బాధితుడి కుమారులిద్దరు పీపీఈ కిట్లు ధరించి ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వారు. తమ తండ్రికి చివరి సంస్కారాలు నిర్వహించారు. ఇంటి పెరడు రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల దీనికి కూడా స్థానికులు అభ్యంతరం చెప్పారు.

ఇంత జరిగినా.. ఇంటిని శానిటైజ్ చేయడానికి ఎవరూ రాలేదు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు సైతం నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించారు. ఫోన్లు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. సోమవారం పరీక్షలు నిర్వహిస్తామంటూ స్థానిక పంచాయతీ సభ్యుడు చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details