రాజస్థాన్ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కలకలంపై కేంద్ర దర్యాప్తు సంస్థ( సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సహా మరికొందరు భాజపా నాయకుల ఫోన్ సంభాషణలను బయట పెట్టిన కాంగ్రెస్ నేతలు రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ సర్కారును కూల్చేందుకు కమలనాథులు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై స్పందించిన భాజపా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం ద్వారా రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగేతర విధానాలకి తెరతీస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించింది.
' ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి' - Rajasthan latest update
రాజస్థాన్‌లో ఆడియో క్లిప్‌ల లీక్‌పై అధికార కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగింది భాజపా. రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ పద్దతులను ఆశ్రయిస్తోందా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేసింది.
దీనిపై తప్పనిసరిగా సీబీఐ దర్యాప్తు చేయించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అందులో అవి యథార్థమైనవి అని ఎక్కడా చెప్పలేదని.. కానీ ముఖ్యమంత్రి గహ్లోత్ సహా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆ ఫోన్ సంభాషణలు యథార్థమైనవని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజస్థాన్‌లో రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా లేదా అని కాంగ్రెస్ అధిష్ఠానం, గహ్లోత్ సర్కారు స్పష్టం చేయాలని పాత్రా అన్నారు. సీబీఐ దర్యాప్తులోనే వాస్తవాలు వెల్లడి అవుతాయని సంబిత్ పేర్కొన్నారు.