మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ఇవాళ శబరిమల ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల ఆలయ సందర్శనకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. సుప్రీంకోర్టు తీర్పుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తృప్తి దేశాయ్ శబరిమల ఆలయ సందర్శనకు సిద్ధమయ్యారు. 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నట్లు ఆమె ప్రకటించారు. కేరళ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ తమను ఆపలేరని తృప్తి దేశాయ్ అన్నారు. భద్రత కల్పించినా కల్పించకపోయినా శబరిమల ఆలయాన్ని సందర్శించి తీరతామన్నారు. ఇప్పటికే ఆమె కొచ్చి చేరుకున్నారు.
నేడు శబరిమల ఆలయంలో ప్రవేశిస్తాం: తృప్తీ దేశాయ్ - నేడు శబరిమల ఆలయంలో ప్రవేశిస్తామన్న తృప్తీ దేశాయ్
రాజ్యాంగ దినోత్సవమైన నేడు.. శబరిమల ఆలయాన్ని దర్శనం చేసుకుంటామని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించినా, లేకపోయినా తాము ఆగేదిలేదని ఆమె స్పష్టం చేశారు.
నేడు శబరిమల ఆలయంలో ప్రవేశిస్తాం: తృప్తీ దేశాయ్
TAGGED:
Trupti Desai to Sabarimala