కరోనా వైరస్ పెళ్లిళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో కేవలం కొవిడ్-19 వల్ల.. పెళ్లికొడుకు లేకుండానే వీడియోకాల్‌లో పెళ్లి జరిపించాల్సి వచ్చింది.
అంటా చౌరాహేకు చెందిన తౌసీఫ్... మారిషస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే నిగోహి కస్బేకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ నెల 19న వారిద్దరికీ నిఖా జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా మారిషస్ నుంచి భారత్‌కు రావల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి.
చేసేదేమీ లేక.. నిశ్చయమైన తేదీనే పెళ్లి జరిపించేందుకు వరుడి కుటుంబ సభ్యులంతా కలిసి, వధువు ఇంటికి చేరుకున్నారు. మతపెద్ద మొదట వధువు పెళ్లికి అంగీకరించినట్టు సంతకం చేయించారు. ఆపై, వీడియో కాల్లో తౌసీఫ్‌తో నిఖా కుబుల్ అనిపించి, పెళ్లి జరిపించేశారు.