తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1500 ఉత్తరాలతో పెద్దాయన 'పెండ్లి పిలుపు'

'పెళ్లిపత్రిక వాట్సాప్​లో పంపించా.. ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసేశా..' అనే మాటలే వినిపిస్తున్నాయి ఈ రోజుల్లో. ఉత్తరాఖండ్​కు చెందిన ఓ పెద్దాయన మాత్రం తనయుడి పెళ్లి శుభలేఖలు ఉత్తరంలోనే పంపించాలని పట్టుబట్టాడు. ఇప్పటికే దాదాపు 1500 ఆహ్వానపత్రికలు పోస్ట్​డబ్బాలో వేసేశాడు. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. ఈ చాదస్తం ఏమిటి అనుకుంటే పొరపాటే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గొప్ప ఆశయమే ఉంది. అదేంటో చూసేయండి మరి..

wedding-card-on-inland-letter-excites-people-of-chamoli- uttarakhand
1500 ఉత్తరాలతో పెద్దాయన 'పెళ్లి పిలుపు'

By

Published : Mar 11, 2020, 12:00 PM IST

1500 ఉత్తరాలతో పెద్దాయన 'పెళ్లి పిలుపు'

'పోస్ట్​మ్యాన్​ సైకిల్​ ఊర్లోకి వచ్చిందంటే చాలు ఊరంతా సందడి షురూ. ఎవరింటికి ఉత్తరమొచ్చిందా అనే ఆత్రుత. ఒకవేళ ఉత్తరం​ మనింటి గేటుకు తగిలించిన పోస్ట్​ డబ్బాలోనే పడితే ఇక పండగే. దూరదూరాల్లో ఉండే ఆత్మీయులు ఏ కబురు పంపారో తెలుసుకునేందుకు మనసు, కళ్ల లోతుల్లో తహతహ. అబ్బో ఆ అనుభూతులన్నీ ఇప్పటి యువకులు అర్థం చేసుకోవాలంటే ఓ తరం వెనక్కి వెళ్లాల్సిందే' అంటూ ఉత్తరంతో ఉండే అనుబంధాన్ని ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరాఖండ్​కు చెందిన సుందరమణి మండోలీ. కుమారుడి పెళ్లికి అతిథులకు శుభలేఖలు 1500 ఉత్తరాల రూపంలో పంపించి కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ​

ఉత్తరం ఉనికి కోసం...

ఈ సెల్​ఫోన్లు, ఇంటర్​నెట్​ రాకముందు ఉత్తరాలే ప్రధాన సమాచార మాధ్యమం. కానీ, పెరుగుతున్న టెక్నాలజీతో జాబుల కోసం ఎదురుచూసే మధురక్షణాలు కనుమరుగయ్యాయి. ఇలా ఉత్తరాలు ఉనికిని కోల్పోవడం చమోలీ జిల్లా ఫాలీ గ్రామానికి చెందిన సుందరమణికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే తనయుడి వివాహ ఆహ్వాన పత్రికలను పోస్ట్​ ద్వారా అతిథులకు పంపి.. తపాలా వ్యవస్థ తిరిగి జీవం పోసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

"ఇలా ఉత్తరాలతో ఆహ్వానించాలని నా మనసులో ఎప్పటినుంచో ఉంది. ఈ కాలంలో ఉత్తరం దాని ఉనికిని కోల్పోయింది. అందుకే నేను దానికి తిరిగి జీవం పోయాలనుకున్నాను. నా కుమారుడి వివాహానికి ఉత్తరం ద్వారానే అతిథులకు సందేశం పంపాలనుకున్నా. 19వ శతాబ్దంలో ఈ ఉత్తరానికి గొప్ప మహత్యం ఉండేది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇదో ఆశాకిరణంగా ఉండేది. ఉత్తరంతోనే సమాచారాలు తెలుకునేవారు. దీని కోసం దాదాపు ఆరు నెలల వరకు కూడా వేచి చూసేవారు. ఉత్తరం వచ్చిందంటే అన్నీ వచ్చేసినట్టే."

-సుందరమణి మండోలీ

ఈ కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలలో సందేశాలు పంపేవారి సంఖ్య తగ్గిపోయింది కాబట్టి.. లెటర్​ ​కార్డుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అయినా సరే.. ఎంతో కష్టపడి 1500 పోస్టుకార్డులను సేకరించారు సుందరమణి.

బంధువులు ఖుష్​

ఉత్తరాలు అందుకున్న బంధువులు 'ఉత్తరంలో శుభలేఖ చూసి ఎన్నాళ్లైంది' అని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

"మా నాన్న సైన్యంలో ఉన్నప్పుడు ఇలా ఉత్తరాలు వచ్చేవి. లేఖలతోనే సందేశాలు అందేవి. చాలా కాలం తరువాత తిరిగి ఈ ఉత్తరాలు చూస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి ప్రయత్నం. ఇంటర్నెట్ వచ్చాక ఉత్తరాలు చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి."

-ప్రీతి మండోలీ, స్థానికురాలు

ఇదీ చదవండి:అదృశ్యమైన కరోనా అనుమానితులు ఎట్టకేలకు ప్రత్యక్షం

ABOUT THE AUTHOR

...view details