గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసులు అధికమౌతున్న కారణంగా.. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింత కఠినం చేశారు అధికారులు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు.
ఇకపై మాస్కు ధరించకపోతే 3 ఏళ్ల జైలుశిక్ష! - gujarath corona
గుజరాత్ అహ్మదాబాద్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఆదేశించారు అధికారులు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా లేదా మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని స్పష్టం చేశారు.
ఇకపై మాస్కు ధరించకపోతే 3 ఏళ్ల జైలుశిక్ష
ఎవరైనా ఇళ్ల నుంచి మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. అంటువ్యాధుల చట్టం కింద ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా అహ్మదాబాద్‌లోనే 266 మంది వైరస్ బారిన పడ్డారు.