తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్లమెంట్​పై​ దాడిలో అమరులకు దేశం రుణపడి ఉంటుంది' - నరేంద్ర మోదీ

పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడిని దేశం ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఘటనలో అమరులైన జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఉగ్రమూకలతో పోరాడుతూ నేలకొరిగిన భద్రతా సిబ్బంది శౌర్యానికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Dec 13, 2020, 8:44 AM IST

Updated : Dec 13, 2020, 11:30 AM IST

పార్లమెంట్​పై దాడి జరిగి నేటితో 19ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆనాటి దుర్ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్​పై దాడిని ఎప్పటికీ మరువలేమన్నారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్​ చేశారు.

" 2001లో ఇదే రోజు పార్లమెంట్​పై జరిగిన దాడిని ఎన్నటికీ మరువలేం. ఈ దుశ్చర్యలో పార్లమెంట్​ను కాపాడేందుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగం, శౌర్యాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి భారత్​ ఎప్పటికీ రుణపడి ఉంటుంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అమరులకు నా సెల్యూట్​: రాజ్​నాథ్​

పార్లమెంట్​పై​ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వారి ధైర్యసాహసాలను భవిష్యత్తు తరాలు సైతం కీర్తిస్తాయని ట్వీట్​ చేశారు. పార్లమెంట్​ను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బంది శౌర్యానికి సెల్యూట్​ చేస్తున్నట్లు చెప్పారు.

2001 డిసెంబర్​ 13న సాయుధ ఇస్లామిక్​ ఉగ్రవాదులు భారత పార్లమెంట్​పై దాడి చేశారు. వారిని భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు దిల్లీ పోలీసులు, ఒక సీఆర్​పీఎఫ్​ మహిళతో పాటు ఇద్దరు పార్లమెంట్​ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు.

ఇదీ చూడండి: అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి

Last Updated : Dec 13, 2020, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details