కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ రమేశ్ కుమార్ జాప్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు. ఐదుగురి రాజీనామాలు సరైన ఫార్మాట్లోనే ఉన్నప్పుడు వాటినెందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ప్రభుత్వం కొనసాగుతుండటంపై అభ్యంతరం తెలిపారు.
"ఐదుగురి రాజీనామాలు మాత్రమే సరైనవిగా ఉన్నాయని స్పీకర్ చెప్పినప్పుడు వాటినెందుకు ఆమోదించలేదు. సరైన ఫార్మాట్లో లేవంటున్నారు. మీరే చెప్పండి ఏదీ సరైనదో? వాళ్లు వచ్చి ఇస్తారు. ఆలస్యం చేసి న్యాయపరమైన అభిప్రాయాలు తెలుసుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు."