కృత్రిమ మేధ(ఏఐ)లో భారత దేశం ప్రపంచస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం ఇందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో సాంకేతికతను ఉపయోగించుకుని విద్యను అభ్యసించడానికి పెద్ద పీట వేసినట్టు పేర్కొన్నారు.
రైజ్-2020 వర్చువల్ సదస్సులో పాల్గొన్న మోదీ.. సర్వీసులో పారదర్శకతను సాంకేతికత మెరుగుపరించిందని వ్యాఖ్యానించారు.
"కృత్రిమ మేధపై చర్చలు జరిపేందుకు రైజ్-2020 ఓ గొప్ప వేదిక. సాంకేతికత, మనిషి అభ్యున్నతికి మధ్య ఎంతో బంధం ఉంది. కార్యాలయాలను సాంకేతికత పూర్తిగా మార్చేసింది. కనెక్టివిటిని పెంచింది. సామాజిక బాధ్యతలను పెంచింది. మనిషికి కృత్రిమ మేధ తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ఏఐలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే అనేకమంది భారతీయులు పనిచేస్తున్నారు."