నూతన సాగు చట్టాలకు బైడెన్ పాలనా యంత్రాంగం పరోక్షంగా మద్దతు పలకడంపై భారత్ స్పందించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామన్న విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ.. రైతుల నిరసనను అన్ని కోణాల్లోనూ చూడాలన్నారు. హింసాత్మక చర్యలను భారత్ అంగీకరించదని.. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు.
"భారత్, అమెరికాలు విలువలతో కూడిన శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు. జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి.. జనవరి 26న భారత్లో చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ రెండూ ఒకేలాంటివి. అక్కడ సమస్య పరిష్కారమైన విధంగానే ఇక్కడా సద్దుమణుగుతుంది."