మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నా...ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్-ఎన్సీపీ గట్టి పోటీనిస్తున్నాయి. క్రితం సారి 122 స్థానాలు నెగ్గిన భాజపా ఈ సారి కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. అయితే.. సేన మాత్రం అదే జోరు కొనసాగిస్తోంది.
ఎప్పటినుంచో అధికారం పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోన్న శివసేన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని భాజపాను కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రతిపాదనతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు.