తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసోంలో దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ అవసరం లేదు'

దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై అసోం ప్రభుత్వం స్పందించింది. సుప్రీం కోర్టు అనుమతిస్తే రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పునర్విచారణ అవసరం లేదని ప్రకటించింది.

we dont accept to apply nrc ammendment at assam said state goverment
'దేశ వ్యాప్త ఎన్​ఆర్​సీని అసోంలో అనుమతించం'

By

Published : Dec 23, 2019, 8:44 PM IST

Updated : Dec 23, 2019, 9:08 PM IST

అసోం సరిహద్దు జిల్లాల్లోని 20 శాతం పేర్ల పునర్విచారణపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు అనుమతిస్తే జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ)ను తమ రాష్ట్రంలో అమలు చేయనవసరంలేదని అసోం ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హిమంత బిస్వా శర్మా స్పష్టం చేశారు. సరిహద్దు జిల్లాల పునర్విచారణలో తప్పులు దొర్లే అవకాశం ఉందని శర్మ పేర్కొన్నారు.

దేశ వ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రతిపాదనపై తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని మోదీ చెప్పడం వల్ల.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటున్నట్టు శర్మ వివరించారు. విచారణకు సుప్రీంకోర్టు నిరాకరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

Last Updated : Dec 23, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details