కర్ణాటక మలేనాడు ప్రాంతంలో కవలకట్టే గ్రామంలోని ఓ ఇంట్లో అరుదైన తెలుపు వర్ణం కొండచిలువ కనిపించింది. శాస్త్రీయంగా దీనిని 'ఆల్బినో పైతాన్' అని పిలుస్తారు. రుతపవనాల ఆరంభం కావడం వల్ల సరిసృపాలు, కీటకాలు సురక్షితమైన స్థలం కోసం వెతుకుతుంటాయి.
శ్వేతవర్ణంలో కొండచిలువ.. ఎప్పుడైనా చూశారా? - తెలుపు రంగు కొండచిలువ
అరుదైన కొండచిలువ కర్ణాటకలోని ఓ ఇంట్లో దర్శనమిచ్చింది. దాన్ని చూసి ఆందోళనకు గురైన ఇంటి సభ్యులు.. పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అతను ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టకొని అటవీ అధికారులకు అప్పగించాడు.
![శ్వేతవర్ణంలో కొండచిలువ.. ఎప్పుడైనా చూశారా? WATCH: White python spotted in Karnataka's Malenadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7478074-788-7478074-1591280546957.jpg)
కర్ణాటకలో దర్శనమిచ్చిన అరుదైన కొండచిలువ
ఈ క్రమంలోనే దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలా తాలూకాలో నౌసాద్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది అరుదైన ఈ శ్వేతజాతి కొండచిలువ. దీంతో భయపడిన కుటుంబ సభ్యులు స్థానికంగా పాములు పట్టే కిరణ్కు సమాచారం అందించారు. అతను పామును పట్టుకొని... అటవీ అధికారులకు అప్పగించాడు. దానిని మంగళూరులోని పిలికుల జంతు ప్రదర్శనశాలకు తరలించారు అధికారులు.
కర్ణాటకలో దర్శనమిచ్చిన అరుదైన కొండచిలువ
ఇదీ చూడండి:'15 రోజుల్లోగా వలస కూలీలను స్వరాష్ట్రాలకు చేర్చాలి'