పంట వ్యర్థాలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్లో అనూహ్యంగా మంటలు చెలరేగిన ఘటన హరియాణా ఫతేహాబాద్‌లోని లహరియా గ్రామంలో జరిగింది. రెండు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపుచేశాయి.
వీడియో: చూస్తుండగానే మంటల్లో కాలిపోయిన ట్రాక్టర్ - ఫతేహాబాద్ ట్రాక్టర్ ఘటన
హరియాణా ఫతేహాబాద్లో పంట వ్యర్థాలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ మంటల్లో పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
పంట వ్యర్థాలున్న ట్రాక్టర్‌కు మంటలు
స్థానిక రైతు లహరియా నుంచి కులంగావ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకున్న వెంటనే రోడ్డు పక్కనే ఆ వాహనాన్ని నిలిపివేశాడు డ్రైవర్. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు.
ఇదీ చూడండి:-కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు