ఆర్టికల్ 370 అమలు, కరోనా కారణంగా మూతబడిన జమ్ముకశ్మీర్ పర్యటక రంగం మళ్లీ ఊపందుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్యటక కేంద్రమైన పహల్గామ్కు పర్యటకుల తాకిడి మళ్లీ మొదలైంది. ఈ జనవరిలో ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పర్యటక కశ్మీరం: పహల్గామ్కు పూర్వవైభవం - జమ్ముకశ్మీర్ పర్యాటక కేంద్రం పహల్గావ్ కు మళ్లీ పర్యాటకుల సందడి
గత ఏడాది నుంచి దెబ్బతిన్న జమ్ముకశ్మీర్ పర్యటకం మళ్లీ గాడినపడుతోంది. ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యటక కేంద్రం పహల్గామ్కు సందర్శకుల తాకిడి మొదలైంది.
పహల్గావ్కు మళ్లీ పర్యాకటకుల తాకిడి
జమ్ముకశ్మీర్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ..ఇక్కడి మంచు దృశ్యాలను తిలకిస్తున్నారు పర్యటకులు. మంచుతో కప్పిఉన్న లోయలు పర్యటకులను ఆకర్షింపజేస్తున్నాయి. పర్యటకం మీదే ఆధారపడ్డ ఇక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఆ గుడిలో మహాత్ముడికి నిత్యపూజలు!