తమిళనాడుకు చెందిన వరుడు.. కేరళకు చెందిన వధువు చిన్నార్ బ్రిడ్జ్ చెక్పోస్ట్ సాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లికి కుటుంబ సభ్యులంతా.. హాజరవ్వాలనే కారణంతో ఇలా రోడ్డుపైనే కల్యాణం కానిచ్చారు.
ఒకప్పుడు పెళ్ళి కుదిరింది మొదలు అమ్మాయి కాపురానికి వచ్చేంత వరకు చుట్టాలు చుట్టుముట్టి ఉండేవాళ్లు. మరి ఇప్పుడు.. కరోనా వైరస్ వల్ల పెళ్లిళ్ల తీరే మారిపోయింది. అందుకే, ఈ చెక్పోస్ట్ పెళ్లిలోనూ అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, మాస్కులు, శానిటైజర్ల మధ్య వివాహం ప్రశాంతంగా జరిపించేశారు.