భారత నావికాదళం శుక్రవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్ ఐఎన్‌ఎస్ ప్రబల్ నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం - Navy missile sinks target ship
భారత నావికాదళం మరో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ట్విట్టర్లో ప్రయోగానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
![యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం WATCH: Indian Navy's anti-ship missile sinks target](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9282210-913-9282210-1603438325058.jpg)
యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయంవంతం
ఉపయోగంలో లేని ఓ నౌకను లక్ష్యంగా ఉంచారు. గరిష్ఠ దూరంలో ఉంచిన ఈ లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేరినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో విడుదల చేశారు.
ఇదీ చూడండి: బిహారీలకు ఉచిత టీకాపై భాజపా క్లారిటీ