తమిళనాడు కోయంబత్తూర్‌లోని పశ్చిమ కనుమల్లో నివాసముంటున్న వారు నిత్యం వన్యప్రాణులతో పోరాడుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రమాదకరమైన పాములు ఇక్కడ సంచరిస్తుంటాయి. కొయంబత్తూర్‌లో నివాసముంటున్న సురేంద్రన్.. పాములను కాపాడేందుకు అటవీ అధికారులతో కలిసి పని చేస్తుంటారు.
శస్త్రచికిత్సతో పాము ప్రాణాలు కాపాడిన వైద్యులు - TAMILANADU SNAKE SURGERY NEWS
తమిళనాడులోని కోయంబత్తూర్ ఓ పాముకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తీవ్రంగా గాయపడిన ఈ విషనాగును చూసిన సురేంద్రన్ అనే వ్యక్తి అటవీశాఖ వైద్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పాముకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.
![శస్త్రచికిత్సతో పాము ప్రాణాలు కాపాడిన వైద్యులు Watch: forest department doctor made surgery to wounded snake](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7185850-495-7185850-1589382025932.jpg)
శస్త్రచికిత్స
ఈ క్రమంలోనే సమీప ప్రాంతంలో గాయపడిన పామును గుర్తించిన సురేంద్రన్.. వాటికి శస్త్ర చికిత్స అందించడంలో పేరున్న అటవీశాఖ వైద్యుడు అశోకన్‌కు తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మరో వైద్యుడి సాయంతో శస్త్రచికిత్స చేసి పాము ప్రాణాలను కాపాడారు.