మధ్యప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం నీరు భారీగా వచ్చి చేరడం వల్ల నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ధార్ జిల్లా ధామ్నోద్ పోలీసు స్టేషన్ పరిధిలో అజ్నార్ నదిలో ఓ కారు కొట్టుకుపోయింది.
లైవ్ వీడియో: నదిలో కొట్టుకుపోయిన కారు - Madhya pradesh Rain news
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో వరద ఉద్ధృతికి నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. మూడు కార్లు కొట్టుకుపోతుండగా... రెండు కార్లను ఒడ్డుకు లాగారు స్థానికులు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల మరో కారు చూస్తుండగానే మునిగిపోయింది.
![లైవ్ వీడియో: నదిలో కొట్టుకుపోయిన కారు Watch: Cars swept away in rain-fed river in Madhya Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8792233-thumbnail-3x2-car-into-river.jpg)
లైవ్ వీడియో: నదిలో కొట్టుకుపోయిన కారు
మొత్తం మూడు కార్లు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుండగా చూసిన స్థానికులు... రెండు కార్లను ఒడ్డుకు చేర్చగలిగారు. అయితే నదీ ప్రవాహం ప్రమాదకరంగా ఉండటం వల్ల ఇంకో కారు మాత్రం... వారి కళ్లముందే కొట్టుకుపోయింది. ఈ దృశ్యాన్ని స్థానికులు తమ ఫోన్లలో రికార్డు చేశారు.
లైవ్ వీడియో: నదిలో కొట్టుకుపోయిన కారు