తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్​: 'ఉగ్రవాది ఒబామా.. కాదుకాదు ఒసామా' - సుశీల్​

బిహార్​లోని పూర్ణియా ప్రచార సభలో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ పొరబాటున చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. తీవ్రవాది ఒసామాకు బదులుగా ఒబామా పేరు చెప్పడం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.

బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ

By

Published : Apr 2, 2019, 1:44 PM IST

బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాను అంతర్జాతీయ తీవ్రవాది అంటూ బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ పేర్కొనటం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్ణియా ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం, మోదీ సాధించిన విజయాలను గొప్పగా చెప్పాలనుకుని బోల్తాపడ్డారు. ఒసామా బిన్​ లాడెన్​కు బదులుగా బరాక్​ ఒబామాను అమెరికా మట్టుబెట్టిందని పేర్కొన్నారు.

" ఈ రోజు నేను జోస్యం చెబుతున్నా. పాకిస్థాన్​లోని తీవ్రవాది బరాక్​ ఒబామాను అమెరికా మట్టుబెట్టిన తరహా రోజు ఎంతో దూరంలో లేదు. ప్రధాని మోదీ ఆదేశాలతో సైనిక బలగాలు పాకిస్థాన్​కు వెళ్లి మసూద్​ అజర్​ను అంతమొందిస్తాయి. ఏమన్నారు(వెనుకనుంచి వేరొకరు సరిగా చెప్పేటప్పుడు)... ఒసామా బిన్​ లాడెనా. ఒసామా బిన్​ లాడెన్​ను అమెరికా మట్టుబెట్టింది."
-సుశీల్​ కుమార్​ మోదీ, బిహార్​ ఉపముఖ్యమంత్రి

40 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన చాలా సార్లు తప్పుగా మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details