"కరోనా కాటేస్తోంది.. వైరస్ వేటేస్తోంది.. కోవిడ్19 వస్తే అంతే సంగతులు.. " అని సామాజిక మాధ్యమాల్లో జోరుగా అసత్య ప్రచారం జరుగుతోంది. కరోనా వేగంగా వ్యాపిస్తుందన్న సంగతి వాస్తవమే అయినా.. అది ఓ వైరస్ మాత్రమే. మానవ సంకల్పం ముందు ఎంతటి కరోనా అయినా మట్టికరవాల్సిందే. కేవలం కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల.. కరోనా దరి చేరదని స్పష్టం చేస్తున్నారు వైద్యులు.
కరోనాపై ప్రజల్లో పెరిగిన అనవసర భయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈటీవీ భారత్ దిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఉషా ఎం కుమార్‌ను కలిసింది. పదే పదే చేతులు కడగడం వల్ల కరోనాను తరిమికొట్టొచ్చని ఆమె తెలిపారు.
"కరోనా వైరస్ కూడా మిగతా సాధారణ వైరస్లు లాంటిదే. ఇది సోకితే జలుబు, దగ్గు, గొంతు సమస్యలు, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఓ ఐదుగురికి కరోనా సోకితే.. అందులో నలుగురికి సాధారణ పారాసెటమాల్ మాత్రలతోనే తగ్గిపోతుంది. ఎవరో ఒకరికి మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వారు వైద్యులను సంప్రదించాలి. కేవలం మాస్క్ మాత్రమే వైరస్ నుంచి రక్షణ కల్పించలేదు. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ శానిటైజర్ లేకపోతే.. సబ్బుతో గంటకోసారి చేతులు కడుక్కోవాలి."
-డాక్టర్ ఉషా ఎం కుమార్
మాస్క్ ఎవరు వేసుకోవాలి?