తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక

అసోం చిరాంగ్​ జిల్లా ఉడాల్​గురి గ్రామంలో నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి ఇద్దరు వ్యక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. మంచానికి ప్లాస్టిక్​ కవర్ చుట్టి కర్ర సాయంతో 5 కిలోమీటర్లు మోసుకెళ్లారు.

గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక

By

Published : Sep 9, 2019, 10:41 AM IST

Updated : Sep 29, 2019, 11:15 PM IST

అసోం చిరాంగ్​ జిల్లా ఉడాల్​గురి గ్రామంలో సరైన రవాణా వ్యవస్థ లేక ఓ నిండు గర్భిణి తీవ్ర ఇబ్బందులకు గురైంది. ప్రసవానికి ఆసుపత్రికి చేర్చేందుకు ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసుకెళ్లాల్సి వచ్చింది.

ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలవగానే కుటుంబ సభ్యులు అంబులెన్స్​కు ఫోన్ చేశారు. సిబ్బంది సరిగా స్పందించలేదు. అందుబాటులో మరే వాహనం లేదు. ఆ సమయంలో వర్షం కురవడం సమస్యను మరింత తీవ్రం చేసింది.

గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక

చేసేది లేక... ఓ మంచాన్నే స్ట్రెచర్​గా మార్చారు కుటుంబ సభ్యులు. మంచానికి పాలిథిన్​ కవర్​ చుట్టి, ఒక పొడవాటి కర్రకు కట్టారు. ఆ కర్రను భుజాలపై మోస్తూ 5 కిలోమీటర్లు నడిచారు. ఆస్పత్రికి చేరకముందే ఆ గర్భిణి ప్రసవించింది.

ఇదీ చూడండి:కరెంట్ తీగల చోరీకి యత్నం- షాక్​తో నలుగురి మృతి

Last Updated : Sep 29, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details