కొన్ని చోట్ల మినహా ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పుల్వామాలో గ్రనేడ్ దాడి, బిహార్లో ఈవీఎం ధ్వంసం, బంగాల్లో తృణమూల్, భాజపా కార్యకర్తల ఘర్షణ వంటి చిన్న చిన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.
11 గంటల వరకు పోలింగ్ శాతాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఓటింగ్ శాతంలో బంగాల్ దూసుకెళ్తోంది. మొదటిస్థానంలో ఉంది. అత్యల్ప ఓటింగ్ నమోదుతో జమ్ముకశ్మీర్ చివర్లో నిలిచింది.
రాష్ట్రం | పోలింగ్ శాతం |
పశ్చిమ్ బంగ | 33.16 |
ఝార్ఖండ్ | 29.49 |
రాజస్థాన్ | 29.32 |
మధ్యప్రదేశ్ | 25.68 |
ఉత్తర్ప్రదేశ్ | 22.46 |
బిహార్ | 20.74 |
జమ్ముకశ్మీర్ | 6.09 |
పుల్వామాలోని స్థానిక పోలింగ్ కేంద్రంపై ముష్కరుల గ్రనేడ్ దాడితో ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పటిష్ఠ చర్యలు చేపట్టింది.