తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశానిదో దారి... విపక్షానిది మరో దారి'

దేశానికి భద్రత కల్పించే చౌకీదార్​(కాపలాదారు)కు ప్రజలు ఓటేయాలని అరుణాచల్​ప్రదేశ్​ ఆలో ఎన్నికల ర్యాలీలో ప్రజలను కోరారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం సాధిస్తున్న విజయాల పట్ల ప్రతిపక్షాలు నిరాశగా ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"సురక్షితంగా కాపాడే చౌకీదార్​కు ఓటేయండి"

By

Published : Mar 30, 2019, 4:53 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​.. ఆలో ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... బహిరంగ సభలో ప్రసంగించారు. దేశం సాధిస్తున్న విజయాల పట్ల కొందరు నిరాశతో ఉన్నారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశాన్ని సురక్షితంగా కాపాడే చౌకీదార్​(కాపలాదారుడు)కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"సురక్షితంగా కాపాడే చౌకీదార్​కు ఓటేయండి"

ఎప్పుడైతే దేశం పెద్ద విజయాన్ని సాధిస్తుందో అప్పుడు మీరంతా సంతోషపడతారు కదా! చదువుకున్న వారు, నిరక్షరాస్యులు, పట్టణవాసి, గ్రామవాసి, పేదలు, ధనవంతులు... ఇలా అందరికీ దేశ విజయం అనందాన్నిస్తుంది కదా! కానీ దేశం విజయం సాధించినప్పుడు కొందరు నిరాశ చెందుతారు. లక్షిత దాడుల సమయంలో ఇదే చూశాం. ఉగ్రవాదుల ఇంటిలోకి భారత్​ చొరబడి మట్టుపెట్టినప్పుడు... వీళ్ల ఎటువైపు ఉన్నారో కూడా మీరు చూశారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే గొప్ప విజయాన్ని సాధించినప్పుడు సైతం వీళ్లు సాకులు వెతుకుతారు. ఏ అంశంపై దేశం మొత్తం గర్వపడుతుందో అదే విషయంపై వీరికి దుఃఖం ఉంటుంది.
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.

ఈశాన్యాన కమల వికాసం అరుణాచల్​ ప్రదేశ్​లోనే 2014లో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు మోదీ. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను వివరించారు.

స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తరవాత అరుణాచల్​ ప్రదేశ్​ను రైల్వే పటంలో చేర్చే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడి నుంచి దిల్లీకి ఎక్స్​ప్రెస్​ రైలులో వెళ్లటం ఏడు దశాబ్దాల వరకు సాధ్యం కాలేదు.
- నరేంద్రమోదీ , ప్రధానమంత్రి.

అరుణాచల్​ప్రదేశ్​లో లోక్​సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్​ 11న జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details