కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. పాసవాన్ అణగారిన వర్గాల తరఫున పోరాడారని కీర్తించారు.
"కేంద్ర మంత్రి రామ్విలాస పాసవాన్ మరణంతో దేశం.. దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. ఆయన చాలా చురుకైన నేత. దీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. అణగారిన వర్గాల గొంతుకగా ఉన్నారు. వారికోసం పోరాడారు.
యువతలో ఆయన ఓ సోషలిస్ట్ ఫైర్‌బ్రాండ్. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ్ వంటి మహానేతల అడుగుజాడల్లో నడిచారు. ప్రజలకు అండగా ఉన్నారు. వారి సంక్షేమం కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా."
- రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
దేశానికి తీరని లోటు..
పాసవాన్ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు.
"పాసవాన్ మరణవార్త విని దిగ్భ్రాంతి చెందా. దేశ రాజకీయాల్లో ఆయన స్థానాన్ని ఎప్పటికీ పూడ్చలేం. ఆయన మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. స్నేహితుడు, విలువైన సహచరుడు, పేద ప్రజలు ఉన్నతంగా బతకాలని ఆశించి కృషి చేసిన వ్యక్తిని నేను కోల్పోయాను.