ఆర్టికల్ 370 రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారి గళం విప్పారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుతో దేశం తీవ్ర సంక్షోభం దిశగా వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ ప్రబలంగా ఉండాలంటే.. జమ్ముకశ్మీర్ ప్రజల గొంతుకను తప్పక వినాల్సిన అవసరముందని మోదీ సర్కారుకు సూచించారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మన్మోహన్.
నేడు రాజ్యసభకు నామినేషన్
రాజ్యసభ ఉపఎన్నికల్లో రాజస్థాన్ నుంచి మన్మోహన్ సింగ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్పష్టం చేశారు. భాజపా రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానం నుంచి మన్మోహన్ పోటీచేయనున్నారు.