విశాఖ గ్యాస్ దుర్ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సహా సంబంధిత అధికారులతో అర గంటపాటు సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడంపై కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
అంతకుముందు... ఈ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.