షిరిడీ సాయిబాబా దర్శనం కోసం వెళ్లేవారు భారతీయ సంప్రదాయాలు, నాగరితకు తగిన విధంగా ఉన్న వస్త్రధారణలోనే రావాలని ఆలయ ట్రస్టు సూచించింది. ఆలయ ఆవరణలో పొట్టి దుస్తుల్లో తిరగడాన్ని నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.
ఆ నియమం పాటిస్తేనే షిరిడీ సాయి దర్శనం! - Shirdi Sai Baba temple trust
షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలంటే తాము తీసుకొచ్చిన కొత్త నిబంధనను పాటించాల్సిందేనని ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. సాయిబాబా మందిరంలోకి భక్తులు ప్రవేశించాలంటే భారతీయ వస్త్రధారణలోనే రావాలని స్పష్టంచేశారు.
![ఆ నియమం పాటిస్తేనే షిరిడీ సాయి దర్శనం! Visitors asked to wear cultured outfits while entering Shirdi Sai Baba temple Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9727769-1091-9727769-1606828197800.jpg)
ఆ నియమం పాటిస్తేనే షిరిడీ సాయిబాబా దర్శనం!
లాక్డౌన్ తర్వాత సాయిబాబా దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తున్నారు. అయితే కొంతమంది భక్తలు టీ-షర్టులు, జీన్స్ వేసుకొని వస్తున్నట్లు గుర్తించింది ట్రస్టు. దీంతో భారతీయ వేషధారణలోనే రావాలనే నియమాన్ని పెట్టింది. కొందరు భక్తుల సూచనలు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టు అధికారులు తెలిపారు.